Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంభోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమీక్ష

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమీక్ష

 

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమీక్ష

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
పెందుర్తి, జూలై 31 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాల్లో శుక్రవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.

ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల తరలింపు, రవాణా, ఇతర ఏర్పాట్లపై అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు లభించిందన్నారు.

ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి పెందుర్తి నియోజకవర్గం నుంచి సుమారు 8 వేల నుంచి 10 వేల మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. శనివారం ఉదయం 5 గంటల నుంచే బస్సులు గ్రామాలకు చేరుకుని ప్రజలను కార్యక్రమ స్థలానికి తరలిస్తాయని, వారికి ఆహారం, ఇతర వసతులు కల్పించి సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశాల్లో ప్రత్యేక అధికారి డీడీవో మంజులవాణి, రమామణి, ఎంపీడీవో పద్మజ, మండల రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular