Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంరేపు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం

రేపు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం

 

రేపు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
గాజువాక, జులై 31 : రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వరుణ జప కార్యక్రమాల్లో భాగంగా గాజువాక పెదగంట్యాడ వినాయక్ నగర్ వుడా కాలనీలోని శ్రీ విశాలాక్షి సహిత విశ్వేశ్వర స్వామి పంచాయతన దేవస్థానంలో శనివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఉదయం 8 గంటలకు వరుణ జప సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, ఉదయం 10 గంటల నుంచి శ్రీ విశ్వేశ్వర స్వామివారికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కల్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ చైర్మన్ యర్రా నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి కె. పద్మావతి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular