ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న సర్పంచ్
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 27:
గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు ఫోటో ఇతర వివరాలను సరిచూసుకోవాలని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరాం నాయక్ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ అధ్యక్షతన బూత్ స్థాయి అధికారులతో గ్రామసభ నిర్వహించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా ఓటర్ల వివరాల సవరణ కొత్తగా అభ్యర్థులైన ఓటర్లు నమోదు అభ్యంతరాలు దావాలకు సంబంధించిన అంశాలపై గ్రామ సభలో బూత్ స్థాయి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామసభలో ఆర్ ఐ స్వప్న మాట్లాడుతూ మండలంలో 30,826 ఓట్లకు గాను 6236 మంది ఓటర్లకు నోటీసులు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ పార్వతి హతిరాం నాయక్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో నోటీసులు అందిన ఓటర్లు సంబంధిత ధ్రువపత్రాలను బీఎల్ ఓలకు అందజేసి ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటర్ జాబితాలో ప్రతి ఒక్కరూ తమ పేరు వయస్సు చిరునామా ఫోటో తదితర వివరాలను పరిశీలించుకోవాలన్నారు వివరాల్లో ఏవైనా తప్పులు పొరపాట్లు ఉంటే సంబంధిత ఆధారాలతో సవరణ చేసుకోవాలని అర్హత ఉన్నప్పటికీ ఓటర్ జాబితాలో పేరు నమోదు కాకుండా మిగిలిపోయిన వారు అలాగే జాబితాలో వివరాల సవరణ అవసరమైన వారు నిర్ణీత ఫారాలు అవసరమైన ధూపత్రాలను సమర్పించాలని సూచించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడు పేరు జాబితాలో ఉండేలా చూడాలని బూత్ స్థాయి అధికారులను కోరారు గ్రామసభలో ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకొని ఓటరు జాబితా పై తమ అభిప్రాయాలను తెలియజేశారు సార్ ప్రక్రియలో ఓటర్ నమోదు చేసుకోవడంలో పొరపాటు చేసిన ఓటర్లకు నోటీసులు అందజేశారు ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు గ్రామ పంచాయతి అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

