రామచంద్రపురం, పెన్ పవర్, ఆగస్టు 20:
కాజులూరు ఎంపీడీవో జాగరపు రాంబాబు–సహజ దంపతుల కుమారుడు హితేష్ గురు తొలి పుట్టినరోజు వేడుకలు గురువారం రామచంద్రపురంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారి హితేష్ జన్మదిన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ వేడుకల్లో పాల్గొని చిన్నారి హితేష్‌ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, కుటుంబ సభ్యులు చిన్నారికి ఆశీస్సులు అందించారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హితేష్ చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. చిన్నారి చిరునవ్వులు, కుటుంబ సభ్యుల సందడి, అతిథుల శుభాకాంక్షలతో వేడుక ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. హితేష్ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు, ఎంపీపీ మాత భారతి, వైస్ ఎంపీపీ పెద్దిరెడ్డి వెంకటరమణ, ఎంపీటీసీ సలాది లక్ష్మణరావు, శలపాక నీటి సంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి, కోట తాతబ్బాయి, అంగర కృష్ణ, సలాది సాయిబాబు, దడాల నాగార్జున, జల్లి సత్యనారాయణ, పోతురాజు భీమారావు, మాజీ సర్పంచ్ పెట్టా వీరనాయుడు, కోమలి వెంకటరమణ, గోపి, డిప్యూటీ ఎంపీడీవో లు,ఎపీవో బి.వెంకటలక్ష్మి, వెలుగు జ్యోతి, రాజ్యలక్ష్మి, పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

