గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 28:మండలంలోని దామనపల్లి పంచాయతీ మాజీ ఎంపీటీసీ కుందేరి వీరమ్మ, ఆమె భర్త కుందేరి నాగరాజు జనసేన పార్టీలో చేరారు. అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్రె వీర వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చినా పంచాయతీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. పంచాయతీ అభివృద్ధి, పవన్ కళ్యాణ్ ఆశయాలపై నమ్మకంతో జనసేనలో చేరినట్లు తెలిపారు. పార్టీ అప్పగించే బాధ్యతను స్వీకరించి పనిచేస్తానని, కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

