Homeఆంధ్రప్రదేశ్పోలవరంకరాటేతో ఆత్మరక్షణ.. ఆరోగ్యకర జీవనం

కరాటేతో ఆత్మరక్షణ.. ఆరోగ్యకర జీవనం

గంగవరం ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉచిత శిక్షణ
విద్యార్థినులకు కరాటే విన్యాసాల ప్రత్యేక ప్రదర్శన

గంగవరం, పెన్ పవర్, ఆగస్టు 30: కరాటే శిక్షణతో బాలికల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అడ్డతీగలకు చెందిన కరాటే గురువు జి. సూరిబాబు తెలిపారు.

గంగవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, వార్డెన్ లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థినులకు ఉచిత కరాటే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరాటే గురువు జి. సూరిబాబు విద్యార్థినులకు ఆత్మరక్షణకు సంబంధించిన పలు మెళకువలను ప్రాక్టికల్‌గా నేర్పించారు.

ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు ఆత్మరక్షణ నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరాటే సాధన వల్ల శరీర దారుఢ్యంతో పాటు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ఉచితంగా ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కరాటే శిక్షకుడు శివతో కలిసి క్రమం తప్పకుండా శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాఠశాల విద్యార్థినుల ఎదుట కరాటే విన్యాసాల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఆత్మరక్షణకు ఉపయోగపడే పలు పద్ధతులను ప్రదర్శించడంతో విద్యార్థినులు ఆసక్తిగా తిలకించారు.

చదువుతో పాటు కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణలో బాలికలు పాల్గొనడం ద్వారా మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగవచ్చని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular