విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 13: ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌తో పాటు జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో చేతికి ఇబ్బంది ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ స్వయంగా వాహనం నుంచి దిగి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరిస్తూ అభివాదం చేశారు. ఆయనను చూసేందుకు, స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి తరలివచ్చారు.
అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొన్నారు.

