పేదల ఆపన్నహస్తం.. సీఎం సహాయనిధి
పెందుర్తి నియోజకవర్గంలో 7 కుటుంబాలకు రూ.5.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , ఆగస్టు 8 :
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శనివారం పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఏడు మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఆపద సమయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న చెక్కులతో పాటు తాజాగా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. నెలలో కనీసం రెండుసార్లు పేదలకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి క్యాంపు కార్యాలయానికి తీసుకువస్తే, వారికి 15 రోజుల్లోనే సీఎం సహాయనిధి ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమాజంలో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడంలో మీడియా చేస్తున్న ప్రచారం అభినందనీయమన్నారు.
ఏడుగురు లబ్ధిదారులకు చెక్కులు
- రావాడ శ్రీరాములు, మొగల్పురం, సబ్బవరం మండలం – రూ.42,734
- పోలమరశెట్టి వెంకటలక్ష్మి, చింతల అగ్రహారం, పెందుర్తి మండలం – రూ.60,734
- గోన మౌనిక, ఊటగడ్డ, పరవాడ మండలం – రూ.63,306
- బోండా రాంబాబు, ఇరువాడ, సబ్బవరం మండలం – రూ.93,358
- శ్రీరంగం కృష్ణవేణి, చిన్నముసడివాడ, జీవీఎంసీ 97వ వార్డు – రూ.1,50,147
- నాగిరెడ్డి మహేశ్వరరావు, దేశపాత్రునిపాలెం, జీవీఎంసీ 79వ వార్డు – రూ.74,829
- వెన్నెల సన్యాసమ్మ, అమృతపురం, సబ్బవరం మండలం – రూ.70,572
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోరుపోలు రామునాయుడు, కర్రి కనకరాజు, వియ్యపు చిన్న, వార్డు అధ్యక్షులు పిల్లా శివకృష్ణ, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, సింగంపిల్లి శ్రీనివాసరావు, పెందుర్తి ఏఎంసీ డైరెక్టర్లు ఆర్.ఎస్.నాయుడు, కోరుబిల్లి సంతోష్, నీటి సంఘం అధ్యక్షుడు సదరం భీమేశ్వరరావు, గొర్లి రమేష్, వెంకటాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యులు మడక బంగార్రాజు, పెందుర్తి సీహెచ్ నంబర్ వరూధిని, సీనియర్ నాయకులు పిల్లా జగన్మోహన్ పాత్రుడు, జుత్తాడ శ్రీనివాసరావు, కర్రి శివ, మోటూరు చైతన్య, మేడపాటి రాము, తమరాన సత్యనారాయణ, గండ్రెడ్డి రమేష్, అంబటి వెంకటేశ్వరరావు, పల్లె మంగరాజు తదితర ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

