శబరి నగర్ రెల్లివీధి పంచాయతీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ అభినందనలు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి.. స్థానిక సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి చేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం, ఆగస్టు 08 (పెన్ పవర్):
శబరి నగర్ రెల్లివీధి పంచాయతీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తూ, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
శబరి నగర్ రెల్లివీధి ప్రాంత అభివృద్ధికి సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వారధిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

