Homeఆంధ్రప్రదేశ్బాపట్లకేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన

చీరాల, సెప్టెంబర్ 29 : చీరాలలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ శాఖ అధికారి రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియ, పోటీ పరీక్షలు, అర్హతలు, పరీక్షలకు సిద్ధమయ్యే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య పోర్టల్‌లో ఇంటర్వ్యూ విధానంపై కూడా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తమ సందేహాలను అధికారిని అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు ముందస్తు ప్రణాళికతో సిద్ధమై, అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సోమేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular