Homeఆంధ్రప్రదేశ్బాపట్లవేటపాలెం జడ్పీ గర్ల్స్ హైస్కూల్ నూతన ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ లుగా ఎన్నికైన సురేఖ,...

వేటపాలెం జడ్పీ గర్ల్స్ హైస్కూల్ నూతన ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ లుగా ఎన్నికైన సురేఖ, నాగార్జున

వేటపాలెం జడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసి ఎన్నికలు : నూతన కమిటీ ఎన్నిక

వేటపాలెం, సెప్టెంబర్ 29  : 

వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నతో పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ. సరోజిని తెలియజేశారు. ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్లుగా యార్లగడ్డ. సురేఖ, బొడ్డు నాగార్జున ఎన్నికయ్యారు. వీరితో పాటు 22 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ పాఠశాలలో విద్యార్థుల నమోదును, రోజువారి హాజరు, గుణాత్మక విద్య, బాలికా విద్యను పెంపొందించడంలో, నిలుపుదల లేకుండా చేయడంలో, ప్రభుత్వం సూచించిన వివిధ కార్యక్రమాలను అమలు పరచడంలో, పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసి, వారి మరియు దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular