Homeతెలంగాణఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ

 

గార్ల పెన్ పవర్ సెప్టెంబర్ 4:

శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గార్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులను శ్రీకృష్ణుడు గోపిక సత్యభామ వేషధారణలో ముస్తాబు చేశారు కృష్ణుడి వేషంలో వేణువు చేతబట్టి నెమలి పింఛం ధరించిన చిన్నారులు వేషధారణలో ముస్తాబైన బాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కృష్ణుడి లీలలను తలపించే వారి సందడి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ బద్దంగా ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టి కోలాటాలు ప్రదర్శించారు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. శ్రీకృష్ణుని నామస్మరణ భగవద్గీత భక్తి పారాయణంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి చేరుకొని శ్రీకృష్ణ పరమాత్ముని కనులారా వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవాలయంలో చిన్ని కృష్ణులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అర్చకులు అచ్చుతాచార్య హైమ బేతి సత్యం బేతి వెంకటేశ్వర్లు భక్తులు మహిళలు చిన్నారులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular