Homeతెలంగాణవిదేశీ కరెన్సీ నాణేల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్..

విదేశీ కరెన్సీ నాణేల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్..

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4:

ఇంట్లో బీరువాలో భద్రపరిచిన విదేశీ కరెన్సీ నాణేలు, నగదు చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి విదేశీ కరెన్సీ నాణేలు, బంగారు మంగళసూత్రాల చైన్లు, కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 3న ఉదయం 9.45 గంటల సమయంలో కనతల సత్యనారాయణరెడ్డి ఇంట్లోని ఉన్న బీరువా నుంచి సుమారు కిలో బరువున్న విదేశీ కరెన్సీ నాణేలు, 22,400 నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందడంతో దీంతో పోలీసులు క్రైం నంబర్ 195/26 యూఎస్ 331(4), 305 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో మర్రిగూడెం క్రాస్‌రోడ్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చింతా యుగంధర్, బోడ సాంబశివరావుగా గుర్తించారు. వారి వద్ద తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ నాణేలు, రూ.2,400 నగదుతో పాటు మహబూబాబాద్ హస్తినాపురంలో చోరీకి గురైనట్లు భావిస్తున్న బంగారు మంగళసూత్రాల చైన్, రెండు జతల కాళ్ల పట్టీలు లభించాయి. ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.2,15,100గా పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు చింతా యుగంధర్, బోడ సాంబశివరావులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎస్సై సాయి కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular