Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నం జాప్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

నర్సీపట్నం జాప్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

పర్యావరణ పరిరక్షణ జర్నలిస్టుల లక్ష్యం

నర్సీపట్నం, పెన్ పవర్ :

పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఆధ్వర్యంలో శనివారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం పట్టణ సీఐ గఫూర్, జాప్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మట్టి వినాయక ప్రతిమల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాప్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లగుడు వెంకటరమణ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. మట్టి ప్రతిమలతో పూజలు నిర్వహించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి భంగం కలగదని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో జాప్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాప్ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ కుంచ జగదీష్, గౌరవ అధ్యక్షులు పులిగా మురళి, గౌరవ సలహాదారు లంక శివకుమార్, ఎన్టీవీ తాతాజీ, మహేష్ (కె టీవీ), రహీం(బిగ్ టీవీ), తాతాజీ (మాకవరపాలెం) మరియు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular