Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిబాల వినాయకునికి మకర తోరణం సమర్పణ

బాల వినాయకునికి మకర తోరణం సమర్పణ

నర్సీపట్నం, పెన్ పవర్ :

​నర్సీపట్నం మున్సిపాలిటీలో 5 రోడ్ల జంక్షన్ వద్ద కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ బాల వినాయక స్వామివారికి ఆదివారం ఘనంగా వెండి మకర తోరణాన్ని బహుకరించారు. ఆలయ కమిటీ మరియు భక్తుల సహాయ సహకారాలతో సుమారు 3 కేజీల 500 గ్రాముల వెండితో ఈ ప్రతిష్టాత్మకమైన మకర తోరణాన్ని తయారు చేయించారు. ​శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి చేతుల మీదుగా ఈ తోరణాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దనిమిరెడ్డి తాతాజీ (బుజ్జి), వైస్ చైర్మన్ ఫణి, సెక్రటరీ గోవింద, కోశాధికారి గౌరి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular