గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 24:అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి నెలకొంది. పార్టీ తరఫున కంకిపాటి మోహన్రావు మాస్టారు నామినేషన్ దాఖలు చేయగా, కంకిపాటి గిరిప్రసాద్, కుందరి రామకృష్ణ కూడా జడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు వేశారు.ఒకే పార్టీ నుంచి ముగ్గురు నాయకులు నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ అధిష్ఠానం ఎవరికి బీఫారం కేటాయిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురిలో అధికారిక అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం నిర్ణయంతోనే ఈ పోటీపై స్పష్టత రానుంది.
జడ్పీటీసీ బీఫారం ఎవరికి? వైసీపీలో ముగ్గురి మధ్య పోటీ!
RELATED ARTICLES

