రాడ్లు, కర్రలతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
వేటపాలెం, అక్టోబరు 8: దేశాయి పేట పంచాయతీ పరిధిలోని విజ్ఞేశ్వర కాలనీలో ముగ్గురు సోదరులపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
లంక జగదీష్, సురేంద్ర, భాను సోదరులపై కూరపాటి లిలిన్, కూరపాటి పోతురాజు, కూరపాటి స్టాలిన్ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. రాడ్లు, కర్రలతో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తూ, తమకు ప్రాణహాని ఉందని, భవిష్యత్తులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. దాడికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

