Homeఆంధ్రప్రదేశ్జీకేవీధి ఎంపీపీగా పూజారి లీలాప్రసాద్ ఘన విజయం 10 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ...

జీకేవీధి ఎంపీపీగా పూజారి లీలాప్రసాద్ ఘన విజయం 10 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ పీఠం కైవసం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 20: గూడెంకొత్తవీధి మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) పూజారి లీలాప్రసాద్ ఘన విజయం సాధించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో 18 మంది ఎంపీటీసీలకు గాను 10 మంది సభ్యుల మద్దతు పొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన వైసీపీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్‌పై విజయం సాధించారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనను ఎంపీపీగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా లీలాప్రసాద్ మాట్లాడుతూ తనకు మద్దతు తెలిపిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన విజయంతో అభిమానులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular