శివలింగానికి విశేష పూజలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి
నర్సీపట్నం, పెన్ పవర్ (నవంబర్ 16) :
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘వ్యసన ముక్త భారత్’ ప్రచార యాత్ర మరియు కార్తీక మాస వేడుకలు నర్సీపట్నంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి గారి ఇంటి వద్ద ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో పద్మావతితో పాటు ఆమె చిన్న కోడలు దివ్యశ్రీ ప్రత్యేకంగా పాల్గొని శివలింగానికి విశేష పూజలు మరియు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశాలతో శాంతి యాత్రను చేపట్టగా, చైర్ పర్సన్ పద్మావతి ఇంటి వద్ద నుంచే ఈ రథయాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. నర్సీపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం గురించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ శాంతి యాత్ర ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిరంతరంగా కొనసాగుతూ వివిధ గ్రామాలు, పల్లెలు, పాఠశాలలు మరియు కళాశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పద్మావతి కార్తీక మాసం విశిష్టతను, బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ నర్సీపట్నం ఇంచార్జ్ బీకే వేణు, బీకే లక్ష్మి, బీకే సోమేశ్వరి, బీకే లలిత తదితర బ్రహ్మకుమారీస్ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.

