శివతత్వంలోనే జీవిత పరమార్ధం దాగి ఉంది: ముద్దగౌని లక్ష్మీప్రసన్న
ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 16:
శివతత్వంలోనే ప్రతి జీవి జీవిత పరమార్ధం దాగి ఉందని కార్తీక మాసంలో ఆ శివుడు ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉంటాడని బి.ఎన్.రెడ్డినగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలోని శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీక మాసం మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది అన్నారు. ఈ మాసంలో శివుడికి మొక్కితే జీవితంలో అనుకున్న కార్యాలు నెరవేరుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత పొందుతారని ఆమె పేర్కొన్నారు. మాల ధారణ స్వాములకు మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో 41 రోజులపాటు అన్నదానం చేయడం వసతి కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్, స్వాములు రాంపల్లి తిరుమలేష్, రావుల ప్రవీణ్ నాయుడు, సంజయ్, పగడాల శ్రీనివాస్, వల్లపు యాదగిరి, అధిక సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.

