Homeతెలంగాణహైదరాబాద్పరమేశ్వర్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు

పరమేశ్వర్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు

ఉప్పల్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు

మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపిన శక్తి సాయినగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ కిట్టు

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 10:

ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డిని శక్తి సాయి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ కిట్టు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎస్.వి. కృష్ణ కిట్టు మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular