Homeతెలంగాణరంగారెడ్డిఅశోక్ నగర్‌లో తీరని డ్రైనేజీ సమస్య

అశోక్ నగర్‌లో తీరని డ్రైనేజీ సమస్య

అశోక్ నగర్‌లో తీరని డ్రైనేజీ సమస్య

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

ఏఈ రోహిత్ స్పందించాలని కాంగ్రెస్ నేత రూపేందర్ రెడ్డి విజ్ఞప్తి

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 10:

ఉప్పల్ నియోజకవర్గం హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. సమస్య పరిష్కారం కోరుతూ సంబంధిత ఏఈ రోహిత్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కౌకుట్ల రూపేందర్ రెడ్డి పేర్కొన్నారు.

డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ పొంగి పొరుతున్న ప్రాంతంలో సాయిబాబా గుడి ఉన్న నేపథ్యంలో భక్తులకు వచ్చే వారు మురుగునీరులోనే ప్రయాణించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఏఈ రోహిత్ ప్రత్యేక చొరవ తీసుకుని అశోక్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రూపేందర్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular