Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరిసంస్కృతి.. సంప్రదాయాల నడుమ దీపావళి సంబరాలు!

సంస్కృతి.. సంప్రదాయాల నడుమ దీపావళి సంబరాలు!

సంస్కృతి.. సంప్రదాయాల నడుమ దీపావళి సంబరాలు!

డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా వేడుకలు

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు.. నరకాసుర వధ నాటకం ప్రత్యేక ఆకర్షణ

కాప్రా పెన్ పవర్‌, నవంబర్ 10:

నాచారంలోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్లో దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల రంగవల్లులు, సంప్రదాయ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ వేడుకలకు పాఠశాల చైర్మన్ కె. నవనీతరావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ కమలా మనోహర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోర్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ కిషోర్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఫణి మాధవి, కోర్ టీమ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గాన కార్యక్రమాలు అలరించాయి. దీపావళి పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు ఇచ్చిన సందేశాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రైమరీ విద్యార్థులు ప్రదర్శించిన ‘నరకాసుర వధ’ నాటకం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫణి మాధవి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీ మార్గంలో నడుస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విద్యతోపాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో పాఠశాల ప్రాంగణమంతా దీపావళి సందడి నెలకొంది. ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా ముగిశాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular