Homeతెలంగాణహైదరాబాద్ఆర్టీఐ సమాచారంపై కాప్రా సబ్‌రిజిస్ట్రార్‌కు ప్రశ్నల వర్షం

ఆర్టీఐ సమాచారంపై కాప్రా సబ్‌రిజిస్ట్రార్‌కు ప్రశ్నల వర్షం

ఆర్టీఐ సమాచారంపై కాప్రా సబ్‌రిజిస్ట్రార్‌కు ప్రశ్నల వర్షం

భూముల రికార్డులు, 22(ఏ) నిషేధిత జాబితా వివరాలేవీ?

కోరిన సమాచారం ఇవ్వకుండా వెబ్‌సైట్‌ వైపు చూపుతున్నారంటూ ఆప్‌ నేత బోట్ల సాయిలు ఆరోపణ

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 9 :

కాప్రా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని భూములకు సంబంధించిన కీలక రికార్డులపై సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు చేసినప్పటికీ, కోరిన సమాచారం పూర్తిస్థాయిలో అందడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోట్ల సాయిలు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కాప్రా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించారు.

కాప్రా పరిధిలోని పలు భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు, భూముల రికార్డులు, సర్వే నంబర్లు, సెక్షన్ 22(ఏ) కింద గెజిట్ నోటిఫికేషన్ నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను ఆయన కోరారు. సంబంధిత భూములకు సంబంధించి కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డుల ధ్రువీకృత ప్రతులను కూడా అందించాలని దరఖాస్తుల్లో విజ్ఞప్తి చేశారు.

అయితే తాను కోరిన కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు అందించకుండా వెబ్‌సైట్‌లో పరిశీలించాలంటూ సూచిస్తున్నారని బోట్ల సాయిలు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన అన్నారు.

భూముల రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితా వంటి కీలక అంశాల్లో పారదర్శకత అవసరమని పేర్కొంటూ, తాను సమర్పించిన ఆర్టీఐ దరఖాస్తులపై సమగ్రంగా స్పందించి కోరిన సమాచారాన్ని అందించాలని కాప్రా సబ్‌రిజిస్ట్రార్ పాండురంగారెడ్డిని బోట్ల సాయిలు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular