ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుదుచ్చరపాలెంలో విరబూసిన బ్రహ్మ కమలం

దుచ్చరపాలెంలో విరబూసిన బ్రహ్మ కమలం

📰 Generate e-Paper Clip

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ దుచ్చరపాలెం గ్రామంలో అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు విరబూసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సాగిన లక్ష్మణరావు నివాస గృహంలో ఈ పుష్పాలు వికసించాయి.రాత్రివేళల్లో తెల్లని వర్ణంతో అందంగా వికసించిన బ్రహ్మ కమలాలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలు అరుదుగా పూయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular