ePaper
Thursday, June 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు.. శుభాకాంక్షల వెల్లువ

సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకం

రామచంద్రపురం, పెన్ పవర్,జూన్ 17: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు బుధవారం రామచంద్రపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డులోని విజయ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్ఛాలు అందజేసి, కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సభా ప్రాంగణం అంతా శుభాకాంక్షల సందేశాలు, కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు మంత్రిని కలసి అభినందనలు తెలిపారు.జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా ప్రజాసేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిర్వహించారు. రామచంద్రపురంలో పలు గృహాల పునఃప్రారంభ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అలాగే కాజులూరు మండలం గొల్లపాలెం ధనలక్ష్మిపేటలో పార్టీ నాయకులతో కలిసి నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే తనకు గొప్ప బహుమతి అని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో మరింత సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, తాడి మాచారెడ్డి (టీఎంఆర్), శలపాక నీటి సంఘం అధ్యక్షులు, జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల డాక్టర్ బాబు, పోతు జ్యోతికుమార్, రామచంద్రపురం ఏఎంసీ వైస్ చైర్మన్ దడాల నాగేశ్వరి నాగార్జున, కాజులూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మోకన వాడపల్లి, అంగర కృష్ణ,తోట కృష్ణ, వల్లు అర్జున్ దాక్షాయణి, పితాని సతీష్ కుమార్, కోట తాతబ్బాయి, సనపల ధనరాజు, అంగర శ్రీను, నక్కా శ్రీను,రెడ్డి శేషారావు, కంచుమర్తి బాబురావు, డేగల సతీష్, ఎంసీ డైరెక్టర్ సలాది పుష్పవతి ,జల్లి సత్యనారాయణ, రంపాల రాజు,బొమ్మిడి సోమలమ్మ, చందాల మల్లి బాబు,డేగల దొరబాబు,తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు ప్రజాసేవ, అభివృద్ధి, సేవా కార్యక్రమాల సమ్మేళనంగా నిలిచి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular