మారుమూల గ్రామాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ జూన్ 30:ఈఆర్‌ఓ మేడం ఆదేశాల మేరకు గూడెం కొత్తవీధి మండల తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు మంగళవారం గాలికొండ పంచాయతీ పరిధిలోని పోలింగ్ స్టేషన్-14లో ఈఎఫ్ డిజిటైజేషన్ పురోగతిని పరిశీలించారు.ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో 18 మారుమూల ఆవాసాలకు చెందిన 982 మంది ఓటర్లు ఉన్నారని, ఆయా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేకపోవడం లేదా పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ మందగించినట్లు గుర్తించారు.ఈ సందర్భంగా సంబంధిత గ్రామాల అంగన్‌వాడీ కార్యకర్తలు,వీఏఓలు,పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన పత్రాలను ఓటర్ల నుంచి సేకరించి సంబంధిత బీఎల్‌ఓకు అందజేసి పూర్తి సహకారం అందించాలని సూచించారు.అలాగే, సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ప్రతిరోజూ డిజిటైజ్ చేసి పురోగతిని మెరుగుపరచేందుకు సంబంధిత బీఎల్‌ఓ ప్రతి సాయంత్రం తహసీల్దార్ కార్యాలయానికి హాజరై డిజిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలని తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు ఆదేశించారు.

