Homeతెలంగాణహనుమకొండనలుగురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్

నలుగురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్

గార్ల పెన్ పవర్, జులై 23:

గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్ జనరల్ సర్జన్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ లు నలుగురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూవ్యాసక్టమి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సురక్షితమైనదని ఈ ఆపరేషన్ పై అపోహలు విడనాడాలని ఈ ఆపరేషన్ వలన శరీర పటుత్వానికి ఎలాంటి ఆటంకం ఉండదని అర్హులైన మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆపరేషన్లు జరిగిన మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ స్వాతి రాణి మెర్సి ఝాన్సీ రాణి నర్సింగ్ ఆఫీసర్స్ ఆశాలత స్వాతి థియేటర్ అసిస్టెంట్ రవీందర్ సిబ్బంది ఎల్లయ్య విజయలక్ష్మి సావిత్రి శ్రీనివాస్ దేవరాజ్ హేమలత అశోక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular