Homeతెలంగాణహనుమకొండబాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి

బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి

గార్ల పెన్ పవర్ జులై 23:

బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు.ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం గార్ల మండల కేంద్రంలోని ఆశ్రమ నిర్మలా హై స్కూల్ లోని 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ టీకాలు అందజేశారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ హనుమంతరావు, వ్యాక్సిన్ ప్రాధాన్యంపై విద్యార్థినులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి మాట్లాడారు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ముఖ్యంగా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. చిన్న వయస్సులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా మెరుగైన రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని తెలిపారు.హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఇది సురక్షితమైన టీకా అని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి బాలికకు ఈ వ్యాక్సిన్ వేయించి వారి ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని తల్లిదండ్రులను కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అర్హులైన బాలికలందరికీ దశలవారీగా హెచ్‌పీవీ టీకాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ జోగయ్య నిర్మల స్కూల్ ప్రిన్సిపాల్ జెన్సి వైద్య సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular