Homeతెలంగాణప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ పార్టీ ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ పార్టీ ధ్యేయం

 

గార్ల, పెన్ పవర్, జూలై 25:

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ పార్టీ ధ్యేయమని
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామ సమీపాన నిర్మాణం చేపడుతున్న హైలెవల్ రహదారి బ్రిడ్జి నిర్మాణ పనులను పార్టీ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి, జిల్లా, మండల నాయకులతో కలిసి శనివారం క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించి నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు పడుతున్న రవాణా కష్టాలు తీర్చేందుకు సిపిఐ నడుం బిగించి చేసిన అలుపెరగని పోరాటాల ఫలితమే హైలై లెవెల్ బ్రిడ్జి సహకారమైందని అన్నారు నిర్మాణంతో రాంపురం మద్దివంచ గ్రామ పంచాయతీ గ్రామాలు అభివృద్ధికి ఒక మైలు రాయిగా నిలవబోతుందని సూచించారు. నిత్యం ప్రజల గొంతుకై ప్రజా సమస్యల పరిష్కార దిశగా సిపిఐ పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బ్రిడ్జి సాకారం దిశగా పోరాడిన సిపిఐ నాయకులను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావును గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి, రాష్ట్ర సమితి సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు భూక్యహరినాయక్, మేదర మెట్ల గిరి ప్రసాద్, రాగం రమేష్, సింగు రమేష్, చాగంటి నీలమ్మ, ధరావత్ వీరన్న, కట్టే బోయిన పిచ్చయ్య, డి జనార్దన్, భూక్య ఫుల్ సింగ్, ఎల్ భీముడు, బి కోటేశ్వరి, తదితరులుఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular