Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

!*

* *డీఎస్సీ అవకతవకలపై ఇదే విధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి!*

* *అసువులు బారిన 21 మంది విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రెండు కోట్లు ఇవ్వాలి*!

* *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్*

 

*కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమం సాధించిన విజయమని, భారత ప్రధానిని కదిలించిన యువత పోరాటానికి సలాం కొడుతున్నామని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు*. అసువులు బారిన భవిష్యత్తులో కాబోయే డాక్టర్లు నీట్ విద్యార్థుల 21 మందికి నివాళులర్పిస్తూ దక్షిణ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం సాయంత్రం *జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల కండువాలు వేసుకుని దక్షిణ వైసిపి శ్రేణులతో వినూత్న బారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుతో యావత్ దేశాన్ని కుదిపేసిన యువత పోరాటంలో అసువులు బారిన 21 మంది కి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున కేంద్రం ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో కోటి రూపాయలు కలిపి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు*. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించారన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు సిగ్గు తెచ్చుకునేలా ఉద్యమాన్ని కదిలించారన్నారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు, యువతకు వాసుపల్లి ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థులు ఐక్యంగా, పట్టుదలతో, ఒకే లక్ష్యంపై పోరాడితే ఎంతటి అధికారాన్నైనా జవాబుదారీగా నిలబెట్టవచ్చని ఈ పోరాటం మరోసారి నిరూపించింది. *ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పై జరిగిన అవకతవకల్లో బాధ్యులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్.. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకే దేశం–ఒకే పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని, నీట్ పరీక్షను రద్దు చేయాలనీ, జాతీయ విద్యా విధానం–2020ను ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేశారు*. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను,ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్,మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, మాజీ కార్పొరేటర్లు, జిల్లా మున్సిపల్ విభాగం ప్రెసిడెంట్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, బిపిన్ జైన్ , వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి, పీతల వాసు, దస్మాంతుల మాణిక్యాల రావు, దొడ్డి బాపు ఆనంద్, ముత్తబత్తుల రమేష్,ఆలుపున కనకరెడ్డి,మహమ్మద్ షకిల్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్, కోడిగుడ్ల శ్రీధర్, మాజీ కార్పొరేటర్ పచ్చిపల్లి రాము, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు,జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు,జిల్లా సెక్రటరీ అభిరెడ్డి అది విష్ణు,స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ, స్టేట్ నాయాకులు దశమంతులు చిన్ని,కనకల ఈశ్వరరావు, సభిరా బేగం,పరవాడ ఈశ్వర్, బాడిదాబోయిన అప్పారావు, బోర విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, వేలంగిని రావు, జిల్లా అనుబంధ సంఘాలు ప్రెసిడెంట్లు వడ్డది దిలీప్, సకల బత్తుల ప్రసాద్, మహమ్మద్ షరీఫ్, జిల్లా అనుబంధ సంఘాల ఉపాధ్యక్షులు గుంటు ఆనంద్,దూడ అప్పారావు ,గరికిన వెంకటేష్,సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు వాసుపల్లి బంగారమ్మ,సువర్త రాజు, తాడి రవితేజ,బేవార మహేష్, డైవ కుమార్,మళ్ళా విజయ్,కందిపల్లి ఆదిలక్ష్మి, బాబ్జి, బొండాడ వెంకటరమణ,VT కృష్ణ,పిల్లా అప్పారావు, గరికిన చంద్ర శేఖర్,సూర్య నాయుడు, దైవ కుమార్,చింతపల్లి లీలా కృష్ణ,ఆకుల శ్యామ్,పిల్లా అప్పారావు జిల్లా అనుబంధ సంఘాలు, వార్డ్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, దక్షిణ వైసిపి సీనియర్ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ వైసిపి మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular