Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంగంటా శ్రీనివాసరావును పరామర్శించిన మంత్రులు

గంటా శ్రీనివాసరావును పరామర్శించిన మంత్రులు

గంటా శ్రీనివాసరావును పరామర్శించిన మంత్రులు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్            విశాఖపట్నం, జులై 29 : కాలి వేలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు బుధవారం ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గంటా శ్రీనివాసరావును పరామర్శించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, అరిమిల్లి రాధాకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు త్వరగా కోలుకుని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular