Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పరుణజపం నేడు

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పరుణజపం నేడు

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పరుణజపం నేడు

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, జూలై 30 : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పరుణజపం నిర్వహించనున్నారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటలకు వేదపండితుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం భీమునిపట్నం శ్రీవారి ఆశ్రమంలో ముత్యాలకూట గణపతి పూజ, పరుణజప సంకల్పం, నవగ్రహ మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. రాజేంద్ర కుమార్, పర్యవేక్షకులు, దేవాదాయ శాఖ అధికారులు, వేదపండితులు, అర్చకులు తదితరులు పాల్గొననున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular