విశాఖ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌ను కొనసాగించాలంటూ ప్రజల విజ్ఞప్తి
విశాఖ, పెన్ పవర్, జూలై 30:
ఉత్తరాంధ్రకు వైమానిక ద్వారంగా పేరుగాంచిన విశాఖపట్నం విమానాశ్రయం దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది. 1937 లో విమానాశ్రయంగా ప్రారంభమైన ఈ కేంద్రం, 1981లో పౌర విమాన సేవలకు అందుబాటు లోకి వచ్చి, అనంతరం అంతర్జాతీయ హోదా పొందుతూ దేశీయ, విదేశీ ప్రయాణాలకు కీలక కేంద్రంగా ఎదిగింది. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాట కులు, ప్రజాప్రతినిధులు, రక్షణ శాఖ అధికారులు, ప్రముఖులు ఇలా కోట్లాది మంది ప్రయాణికులకు విశాఖ విమానాశ్రయం ఎన్నో దశాబ్దాలుగా సేవలం దిస్తోంది. గత పదేళ్లలోనే ప్రయాణికుల రద్దీ 170 శాతానికి పైగా పెరిగి, 2025–26 ఆర్థిక సంవత్స రంలో సుమారు 29.68 లక్షల మంది ఈ విమా నాశ్రయం ద్వారా ప్రయాణించినట్లు ఎయిర్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.ప్రయాణికుల రవాణాతో పాటు కార్గో సేవల్లోనూ విశాఖ విమానాశ్ర యం కీలక పాత్ర పోషిస్తోంది. 2025లో సుమారు 4,900 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా నమోదై, ఎగుమతులు– దిగు మతులకు ఈ విమానాశ్రయం ప్రధాన కేంద్రంగా నిలిచింది.భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి స్వా గతించదగిన పరిణామమే అయినప్పటికీ, విశాఖ నగరంలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని పూర్తిగా మూసి వేయకుండా దేశీయ (డొమెస్టిక్) విమాన సేవలకు కొనసాగించాలని నగరవాసులు కోరుతున్నారు. నగరానికి సమీపంలో ఉండటం వల్ల సమయం, ఖ ర్చు ఆదా కావడంతో పాటు అత్య వసర ప్రయాణాలు చేసే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుం దని వారు అభిప్రాయ పడుతున్నారు.ప్రస్తుత విమా నాశ్రయాన్ని మూసి వేస్తే నగర ప్రజలు భోగాపురం చేరుకోవడానికి మూడు నుంచి నాలుగు గంటల వరకు అదన పు ప్రయాణం చేయాల్సి వస్తుందని, వృద్ధులు, చిన్నారులు, రోగులు, వ్యాపారవేత్తలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల భోగాపురం విమా నాశ్రయాన్ని అంత ర్జాతీయ కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చే స్తూనే, విశాఖపట్నం విమానాశ్రయాన్ని దేశీయ విమాన సేవల కోసం కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నిర్ణయం తీసుకోవాలని విశాఖ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

