గార్ల, పెన్ పవర్, ఆగస్టు6:
తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తొలి ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనంత రాములు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకొని గురువారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలోని జయశంకర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని నినదీస్తూ తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని కలిగించి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు తుది శ్వాస వరకు పోరాడి తన జీవితాన్ని రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన మహా యోధుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎర్రబోయిన బిక్షమయ్య ఎండి ఖదీర్ బాబా వెంకట్ బండారి దేవేందర్ ముంగి రాములు వేణు సంగిశెట్టి ప్రభాకర్ చంద్రశేఖర్ పానుగంటి రాధాకృష్ణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

