మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశం?
ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 11:
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో సీపీఐకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అక్కినేపల్లి దేవయ్యాచారి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ విజయానికి దేవయ్యాచారి కీలకంగా పనిచేశారు. అలాంటి వ్యక్తి సీపీఐకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం సీపీఐకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా దేవయ్యాచారి మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి నాయకత్వంలోనే ప్రాంతంతో పాటు తన 28వ వార్డు మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో సీపీఐకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు 28వ వార్డులో సక్రమంగా అమలు కావాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని దేవయ్యాచారి పేర్కొన్నారు.

