Homeతెలంగాణబాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 11:

గార్ల మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గంధసిరి వీరన్న తల్లి గంధసిరి పుల్లమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న గార్ల పిఎసిఎస్ సింగిల్‌ విండో చైర్మన్‌ వడ్లమూడి దుర్గాప్రసాద్‌ మంగళవారం దమ్మాయిగూడెంలోని ఆమె స్వగ్రామానికి వెళ్లారు.
ఈ సందర్భంగా పుల్లమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ భూక్య నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కట్ట శ్రీనివాస్‌, పాల్తీయా కిషన్‌, లెనిన్‌, పళ్ళ నరసయ్య, కత్తుల ప్రశాంత్‌ తదితరులు పాల్గొని పుల్లమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular