కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ పాదయాత్ర
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ మధురవాడ, ఆగస్టు 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా గురువారం మధురవాడలో పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కామ్రేడ్ జె.వి. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మధురవాడలోని సీపీఐ కార్యాలయం వద్ద పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ మీదుగా స్వతంత్రనగర్, దుర్గానగర్, గణేష్‌నగర్, బొట్టవానిపాలెం, శ్రీనివాసనగర్, ఆదిత్యనగర్ ప్రాంతాల మీదుగా మెయిన్‌రోడ్డుకు చేరుకుని తిరిగి సీపీఐ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరచడం, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

