Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లి80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,     అనకాపల్లి ఆగష్టు 15: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచే 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి రింగ్‌ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని కొణతాల రామకృష్ణ అన్నారు.

భారత్ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతోందని, 2047 నాటికి వికసిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో దేశం పురోగమిస్తోందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలిచి దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం జై హింద్.. జై భారత్ అంటూ దేశభక్తి నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular