Homeతెలంగాణదోమల నివారణకు 'ఫాగింగ్ డ్రైవ్'

దోమల నివారణకు ‘ఫాగింగ్ డ్రైవ్’

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18:

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కట్టడికి గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతీ హతీరాం నాయక్ ఆధ్వర్యంలో దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలలో భాగంగా మంగళవారం పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో ఫాగింగ్ డ్రైవ్ నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వార్డుల్లో దోమలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ డ్రైవ్ చేపట్టినట్లు ఆమే తెలిపారు వార్డులలోని ప్రజలందరూ తమ బాధ్యతగా పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు లేకుండా చూసుకోవాలన్నారు దోమల వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విష జ్వరాలు తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని  సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు నాయుడు వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్ గ్రామపంచాయతీ దాసు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular