Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: డి.ఎస్.పి సిహెచ్ తిరుమలరావు

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: డి.ఎస్.పి సిహెచ్ తిరుమలరావు

  • గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 19: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్‌.తిరుమలరావు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను బుధవారం డీఎస్పీ సందర్శించారు. గూడెంకొత్తవీధి సీఐ బి.సుధాకర్‌, ఎస్సై కె.సురేష్‌లతో కలిసి విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోక్సో చట్టం, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, సోషల్‌ మీడియా వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలలపై జరిగే వేధింపులు, నేరాల నుంచి రక్షణ పొందేందుకు పోక్సో చట్టంపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అలాగే రహదారులపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్‌ ధరించడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular