గార్ల, పెన్ పవర్, ఆగస్టు 27:
గార్ల మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్ధినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డోర్నకల్ మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి(సీడీపీవో) లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుండి నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, మండలంలో 4 అంగన్వాడీ టీచర్ 35 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుకు ఈ నెల 25.వ తేదీ నుండి వచ్చే నెల 3.వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పోస్టుకు స్థానికంగా ఉన్న మహిళలు అర్హులని, ఇంటర్, 10+2 పాసై ఉండాలని, 1.07.2026 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లకు మించకుండా ఉండాలని ఈ సదవకాశాన్ని స్థానిక మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

