గార్ల ,పెన్ పవర్, ఆగస్టు 31:
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ గార్ల మండల మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం గార్ల మండల పరిధిలోని ముల్కనూర్, పెద్ద కిష్టాపురం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ, వెయ్యి రోజులు గడిచినా అమలు కాని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణలను ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్ డి సలీం ధారావత్ సక్రు పుల్లూరు వెంకటేశ్వర్లు చిలక లక్ష్మీనారాయణ షఫీ మీగడ శ్రీను సాయికుమార్ నాగచారి రమేష్ నాగేశ్వరరావు రామకృష్ణ చౌదరి కిరణ్ మార్గం ఉపేందర్ పసుపులేటి రాజు నాగరాజు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

