Homeఎడిటోరియల్రాజ్మా విత్తనాల కోసం రైతుల క్యూ-ఓటీపీలు రాక రైతుల ఇబ్బందులు

రాజ్మా విత్తనాల కోసం రైతుల క్యూ-ఓటీపీలు రాక రైతుల ఇబ్బందులు

  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబరు 3: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి రైతు భరోసా కేంద్రంలో రాజ్మా చిక్కుళ్ల విత్తనాల కోసం రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం 90 శాతం రాయితీతో విత్తనాలను అందజేస్తుండటంతో వివిధ గ్రామాల రైతులు ఆర్బీకే వద్ద బారులు తీరారు. అయితే విత్తనాల పంపిణీ సమయంలో మొబైల్ ఫోన్లకు ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాల పంపిణీ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular