Homeతెలంగాణకాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన గళం

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన గళం

          రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు

         గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 3:

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో భారీ ధర్నా నిర్వహించారు.ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం’ వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పిలుపుమేరకు ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సూచనలతో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు మాట్లాడుతూఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు ఉంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొది లేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి రామారావు కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పానుగంటి రాధాకృష్ణ వీరారెడ్డి శంకర్ మురళి ఖదీర్ బాబా రాందాసు బాలు గణేష్ ఉమేష్ మోహన్ రావు అశోక్ శ్రీనాథ్ అనిల్ రవీందర్ రామారావు యాకూబ్ పాషా శ్రీను అంబయ్య వెంకట్ నరసింహ మురళి వంశీ శంకర్ మహేష్ ఖలీల్ శివ వెంకన్న సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular