గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్2:
పొలంబడి కార్యక్రమంతో రైతులు పురు గుమందుల అవశేషాలు లేని నాణ్యమైన ఆహారోత్పత్తులు సాధించవచ్చని ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప అన్నారు. గార్ల మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ ప్రొడక్షన్ ఆఫీసర్ ఉదయ శంకర్ ఆధ్వర్యంలో బుధవారం రైతు పొలంబడి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్లాంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప హాజరై మాట్లాడారు మిరపలో పొలంబడి ఉద్దేశాన్ని 14 వారాల పాటు నిర్వహించే తరగతుల గురించి వివరించారు.పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు మంచి వ్యవసాయ సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, విత్తనం ఎంపిక నుంచి విక్రయం వరకూ శాస్త్రీయ పంట సాగు పద్దతులపై అవగాహన కల్పించడం జరుగుతుందని రైతులందరూ ప్రతి వారం పొలంబడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్య కైలా గార్ల బయ్యారం మండలాల వ్యవసా య అధికారులు రామారావు రాజు ఉద్యానవన శాఖ అధికారి శాంతి ప్రియ వ్యవసాయ విస్తరణ అధికారి మేఘన గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

