Homeఆంధ్రప్రదేశ్కాకినాడతాగునీటి సమస్యపై డేగల నాగేంద్ర తక్షణ స్పందన

తాగునీటి సమస్యపై డేగల నాగేంద్ర తక్షణ స్పందన

పాతమొగలిపాలెం గ్రామానికి డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా

కాజులూరు,పెన్ పవర్,సెప్టెంబర్ 21:
ప్రపంచంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని పరిస్థితి రావడం బాధాకరమని రామచంద్రపురం నియోజకవర్గ జనసేన యువ నేత డాక్టర్ డేగల నాగేంద్ర అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్ తరఫున తక్షణ సహాయక చర్యలకు డాక్టర్ డేగల నాగేంద్ర శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాతమొగలిపాలెం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా తాగునీరు అందించాలని నిర్ణయించారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి పాతమొగలిపాలెం గ్రామానికి వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ డేగల నాగేంద్ర తెలిపారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ రోజుల్లో (ఆల్టర్నేట్ డేస్) వాటర్ ట్యాంకర్‌ను గ్రామానికి పంపిస్తూ, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ సేవలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల అవసరాలను గుర్తించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని నాగేంద్ర పేర్కొన్నారు. “ప్రజల అవసరం మా బాధ్యత.. ప్రజా సేవే మా లక్ష్యం” అనే నినాదంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, పార్టీ పెద్దలు, జనసేన నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని డాక్టర్ డేగల నాగేంద్ర తెలిపారు.తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular