బాపట్ల, సెప్టెంబర్ 30 : పట్టణంలోని 7, 8 వార్డుల పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మందపాటి ఆంద్రెయ, మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, 7వ వార్డు ప్రెసిడెంట్ కేసన వీర రాఘవులు, 8వ వార్డు ప్రెసిడెంట్ చింతా యోసోబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాల నారాయణతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

