చీరాల, సెప్టెంబరు 30: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలోని రంగారావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. దాసరి దిలీప్ అనే గృహ యజమాని ఇంట్లో మార్బుల్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మార్బుల్ పనుల్లో భాగంగా విద్యుత్ పరికరాలను వినియోగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

