Homeఆంధ్రప్రదేశ్బాపట్లఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం

వేటపాలెం, అక్టోబర్ 5: 2026 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) వేటపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు.

గత నెల 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఎన్. సూర్యనారాయణ, డి. హేమంత్ కుమార్, ఎన్. శ్రీనివాసరావు, ఎస్. లలితా పరమేశ్వరి, ఎస్. నాగరాణి, డి. బేబీ కరుణశ్రీలను యూటీఎఫ్ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు.

అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో పొట్టి సుబ్బయ్యపాలెం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 26 నుంచి 56కు పెంచిన ప్రధానోపాధ్యాయుడు జి. మారుతిని కూడా సన్మానించారు.

కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ ఉపాధ్యక్షులు బి. బిక్షాలు బాబు, రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక నాయకులు కుర్రా రామారావు, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు పి. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.వి. శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular